శ్రీరాముడిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కత్తి మహేష్.. అరెస్ట్ చేసిన పోలీసులు
కొంతమందికి వివాదాలు కొత్తకాదు. నిత్యం వివాదాలతోనే వారు కాలం వెళ్లదీస్తుంటారు. అలాంటి వారిలో సినిమా వారిలో రామ్‌గోపాల్‌వర్మ ఒకరు. ఇక ఫిలిం క్రిటిక్స్లో కత్తి మహేష్ ఒకరు. వీరికి వివాదాలే ఆహారం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడూ వార్తల్లో నానుతూ ఉండాలన్నది వీరి కోరిక కాబోలు. ఆమధ్య పవన్‌కల్యాణ్‌పై కామెంట్స్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన కత్తి మహేష్. ఇప్పుడు ఏకంగా దేవుడిపైనే కామెంట్స్ చేస్తూ కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టాడు.
దాంతో హిందూ సంఘాలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మొదట ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచారు. మహేష్‌కు 15 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఈ వివాదంలో ఒక కేసు కాదు, చాలా కేసులు నమోదయ్యాయి. పలుమార్లు కత్తి మహేష్‌ను విచారించిన పోలీసులు శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న మహేష్ ఒకసారి నగర బహిష్కారానికి కూడా గురయ్యాడు. ఆరు నెలలపాటు నగరంలోకి అనుమతి లేకపోవడంతో నగరం బయటే గడిపాడు మహేష్. ఈమధ్యకాలంలో కాస్త నోటి దురుసు తగ్గించుకున్న మహేష్ మరోసారి విజృంభించి కటకటాల వెనక్కి వెళ్ళాడు.













