పట్టభద్రులు విజ్ఞతతో ఓటు వేయాలి : కాస్లర నాగేందర్ రెడ్డి

పట్టభద్రులు విజ్ఞతతో తమ ఓటు వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో ప్రజల పక్షాన ప్రశ్నించే బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు.