విదేశాల్లో ఒక గుర్తింపుతో ఉన్నామంటే… అది కేసీఆర్

విదేశాల్లో తమకంటూ ఒక గుర్తింపుతో ఉన్నామంటే అది కేసీఆర్ చలవే అని టీఆర్‍ఎస్ ఆస్ట్రేలియా విభాగ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలోను నేడు తెలంగాణ నిర్మాణంలో రేపు జరగబోయే అభివృద్ధిలో తెలంగాణకు చెందిన ఎన్నారైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు కేసీఆర్‍ను, టీఆర్‍ఎస్‍ను అస్థిరపరించేందుకు ఎన్నో శక్తులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయన్నారు. వీరి కుట్రలకు, కుతంత్రాలకు ఏనాడూ తలొగ్గబోమని అన్నారు. తమ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కాపాడే నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని అన్నారు. పెడితే పెళ్లి.. లేకపోతే చావు కోరే కొంత మంది మాత్రమే ఎన్నడూ లేని తమ విషపూరిత ప్రేమను టీఆర్‍ఎస్ బర్తరఫ్ నేతలపై చూపుతున్నారని ఎద్దేవా చేశారు.