మళ్లీ బీఆర్ ఎస్ దే అధికారం : కాసర్ల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆస్ట్రేలియా నుండి వచ్చిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిని, వారి బృందాన్ని జగిత్యాల ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ అభినందించారు. ఎన్నారైలు ప్రచారంలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మళ్లీ అదే స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి ఎప్పటికీ కొనసాగాలంటే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో తమ బృందంతో ఆస్ట్రేలియా నుండి తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం, గురించి గడప గడపకు చెప్తూ వివరించామన్నారు. సీఎం కేసీఆర్ తమ కృషిని కొనియాడటం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని తెలిపారు.













