టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి, సభ్యత్వానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయకూడదని పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. కార్యకర్తలతో సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 67 మంది అభ్యర్థులను ఎంపిక చేశాం. 35 మందితో చంద్రబాబు ఇప్పటికే ముఖాముఖి మాట్లాడారు. ఇప్పుడు పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదనే అంశంపై అధ్యక్షుడు కారణం చెప్పలేదు. అదే అర్థంకాని ప్రశ్నంగా మిగిలిపోయింది. అలాగని చంద్రబాబు మీద కోపం లేదు. ఆయన చెప్పిన విధానంపైనే అసంతృప్తి ఉంది అని వివరించారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని, కార్యకర్తలతో చర్చించి కుత్బుల్లాపూర్ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు.













