వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ క్లీన్ స్వీప్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో చంద్రబాబుకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ క్లిన్ స్వీప్ చేస్తుందన్నారు. చంద్రబాబుకు భయపడే జగన్ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. మచ్చలేని మనిషిగా చంద్రబాబు బయటికి వస్తారన్నారు. అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని అన్నారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపపంచమంతా చంద్రబాబు అభిమానులు భగ్గమంటున్నారని కాసాని పేర్కొన్నారు.













