జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరుపై సీఎం సమీక్షించారు. ప్రజారోగ్యంపై మంత్రులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విదితమే. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది కూడా. అయితే పథకంలో భాగంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ కార్యక్రమం అప్పుడు విజయవంతమైంది.













