రెండో విడత కంటి వెలుగు ప్రారంభం
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయ్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించారు. కలెక్టరేట్లో మొదట నేతలు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండో విడుత కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులకు కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.













