కవిత గెలుపు ఊహించిందే, BOSS is BACK : మహేష్ బిగాల (తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్)
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చరిత్ర సృష్టించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ చరిత్రలోనే ఆమె అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఘనవిజయం సాధించారు,
మహేష్ బిగాల గారు మాట్లాడుతూ ఒక గొప్ప వక్త, అన్ని రంగాలలో మంచి విషయ పరిజ్ఞానం, ప్రజా సమస్యల పై ఎనలేని పోరాట స్వభావం ఉన్న నాయకురాలు కవిత అని కొనియాడారు , ఉమ్మడి నిజామబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిందని, దుబ్బాక ఉపఎన్నికలో కూడా ఇవే ఫలితాలొస్తాయని అన్నారు. BOSS is BACK అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.













