ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి దర్బార్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమె చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 9న జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఉన్నికల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.













