64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న కడెం ప్రాజెక్టు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేని విధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు ప్రకటించారు. కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నీటిమట్టానికి చేరుకొని 5 లక్షల క్యూసెక్యుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తిన అందులో ఒక్కటి లేవక పోయేసరికి మొత్తం 17 గేట్లు ఎత్తి అధికారులు రెండు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగకు వదిలారు. అయినా అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పై నుంచి నీరు ప్రవహిస్తుంది. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













