ఎన్నికల్లో పోటీ చేద్దామంటే మా పార్టీకి .. సింబల్ ఇవ్వలేదు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే తమ పార్టీకి సింబల్ ఇవ్వలేదని, దీని పై హైకోర్టుకు వెళ్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు. మా పార్టీలో చేరాలని మందకృష్ణ మాదిగను కోరితే రూ.25 కోట్లు అడిగారని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన అమ్ముడుపోయారు అని ఆరోపించారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన మాదిగల బహిరంగ సభ నిమిత్తం మందకృష్ణకు రూ.72 కోట్లు ముట్టాయని, ఎంపీ పదవి ఇస్తారని ఆశతోనే ఆయన అమ్ముడుపోయారని విమర్శించారు. మాదిగలకు మోదీ ఇన్నిరోజుల్లో చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా అని పాల్ నిలదీశారు.













