తాను అధికారంలోకి వస్తే.. ఒక్కో మండలానికి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీటింగ్లు నిర్వహిస్తున్నప్పుడు లైట్లు ఆపుతున్నారని, ముఖ్యమంత్రి గూండాయిజం తగ్గడం లేదని, తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 26 మంది అభ్యర్థులు తనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో తాను 30 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని సీఎం కేసీఆర్కు నిద్ర పట్టడం లేదన్నారు. కేసీఆర్ మాటలు నమ్మొద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చెస్తానని చెప్పి, మాట తప్పారన్నారు. తాను అధికారంలోకి వస్తే ఒక్కో మండలానికి ఒక్కో కాలేజ్, హాస్పిటల్ కడుతానని అన్నారు.













