సీఎం రేవంత్ కు కేఏ పాల్ ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని కేఏ పాల్ తెలిపారు. సదస్సుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు తెలిపారు. పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు పాల్ తెలిపారు.













