కేసీఆర్, కేటీఆర్‌లకు భయపడేది లేదు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అమీర్‌పేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిన్న (సోమవారం) బ్లాక్ డే అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తనపై దాడి చేయించారని ఆరోపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గుండాగిరి కేసీఆర్, కేటీఆర్ చేస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటలో జరిగిన సంఘటన కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వ్యక్తే తనపై దాడి చేశారని తెలిపారు. 150 దేశాలను వణికించి వచ్చానని, కేసీఆర్, కేటీఆర్‌లకు నేను భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని నేను కోరుకున్నా. నేను ఆంధ్ర వాడిని అని అంటున్నారు. మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలి. నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు, అన్ని చారిటీల మీద ఉన్నాయి.













