ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా బాబూ మోహన్

ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ను ఆ పార్టీ అధినేత కేఏ పాల్ నియమించారు. కాగా, బాబూ మోహన్ కొద్ది రోజుల క్రితమే ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ పెద్దల వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పార్టీ తనని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.