తెలంగాణ నుంచి రాజ్యసభకు కెకె, సురేష్ రెడ్డి ఏకగ్రీవం
తెలంగాణ నుంచి రాజ్యసభకు టిఆర్ఎస్ అభ్యర్థులు కె. కేశవరావు, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు స్థానాలకు ఇద్దరే బరిలో నిలవడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం టిఆర్ఎస్ రాజ్యసభ్యులు కె.కేశవరావు,కెఆర్.సురేష్‌రెడ్డి టిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ లక్ష్యాలను జాతీయస్థాయిలో పూర్తి చేసేందుకు తమవంతు క•షి చేయనున్నట్లు చెప్పారు. రాజ్యసభకు అవకాశం కల్పించిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.













