7న రాష్ట్ర హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ ప్రమాణం
ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్‌భవన్‌లో జరుగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొననున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
జస్టిస్ హిమా కోహ్లీ 1959, సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్ నుంచి పాఠశాల విద్యాభ్యాసం, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం హిస్టరీలో పీజీ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన 1984లో ఢిల్లీ యూనివర్సిటీ లా సెంటర్లో ఫ్యాకల్టీగా చేరారు. 2006 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకమై 2007, ఆగస్టు 29న శాశ్వత జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వివిధ కమిటీలకు చైర్‌పర్సన్‌గా పనిచేసి, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సీజేగా ఎంపికయ్యారు.













