తెలంగాణ సీజేగా అలోక్ ఆరాధే రేపు ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే రేపు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. అదివారం (23వ తేదీ) ఉదయం 11:00 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రధాన న్యాయమూర్తిగా ఆరాధే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుండీ వీవీ జంక్షన్ వరకు రాజ్ భవన్ రహదారిలో ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు భారీ ట్రాఫిక్ ఉంటుందని పోలీసులు తెలిపారు. వీవీ విగ్రహం` మోనప్ప జంక్షన్ మధ్య ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ రూట్ వచ్చే వాహనదారులు పంజాగుట్ట` గ్రీన్‌ల్యాండ్స్, పంజాగుట్ట నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్`షాదన్ నిరంకారి వైపు వెళ్లాల్సి ఉంటుంది. పంజాగుట్ట రోడ్ రాజ్ భవన్ క్వార్టర్స్ రోడ్ (మెట్రో రెసిడెన్సీ) నుండి ఇరువైపులా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.













