ఈ పదేళ్లలో ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి : జేపీ నడ్డా
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని, ఈ పదేళ్లలో ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారు. దళిత బంధులో ప్రజా ప్రతినిధులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదు. ప్రధాని మోదీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి చేరింది. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నాం. కుటంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించాం. అదే మాదిరిగా కుటుంబ పాలన నుంచి తెలంగాణకూ విముక్తి కల్పిస్తాం అని అన్నారు.













