తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో పర్యటించనున్నారు. ఈ నెల 25న నాగర్కర్నూల్లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన కూడా త్వరలో ఖరారు అవుతుందని నేతలు తెలిపారు. వాయిదా పడిన బీజేపీ బహిరంగ సభను ఖమ్మంలోనే నిర్వహించాలని నిర్ణయించామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్ వెల్లడిరచారు. నేతలంగా సమష్టిగా కలిసి ఎన్నికల సమరంగంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీ ముఖ్య నేతలందరికీ కీలకమైన బాద్యతలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వంతో పార్టీ సమష్టిగానే పని చేస్తోందన్న తరుణ్ ఛుగ్, బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయనడం అభూత కల్పనేనని అన్నారు.













