మోదీ వల్లే ఇవాళ భారత్.. ప్రపంచంలోనే : నడ్డా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లే ఇవాళ భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చాయా? తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. రైతులు, పేదలు, మహిళా విరోధి కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారన్నారు.













