బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
తెలంగాణలోని అతిపెద్ద పండుగల్లో ఒకటైన బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్వేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పండుగ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కట్టుకోవాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళలు బతుకమ్మ సంబురాలను ప్రభుత్వ లాంఛనాలతో గల్లీ గల్లీలో ఆనందంగా జరుపుకుంటున్నారన్నారు.













