ఏటా సంతోషంగా వచ్చేవారు… ఈ ఏడాది మాత్రం దుఖంతో
ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపై నిలబడి భక్తులు అడిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తన వద్దకు వచ్చేవారు సంతోషంతో కాక దుఖంతో వస్తున్నారని స్వర్ణలత రంగంలో తెలిపారు. ఏటా భక్తులు తనవద్దకు సంతోషంగానే వస్తున్నారని, అయితే ఈసారి మాత్రం సంతోషం లేకుండా పోయిందెందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున సమర్పించిన బంగారు బోనం కొంత సంతోషం.. కొంత దుఖాన్ని కలిగించిందని చెప్పారు. బంగారు బోనంతో ఆనందపర్చడమనేది మూర్ఖత్వమే అని అన్నారు. ఆడపడుచులందరూ దుఖంతో ఉన్నారని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం అంత ఆనందిపరిచే విధంగా ఏమీలేదని అన్నారు. తన భక్తులకు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారని కానీ కీడే ఎక్కువగా చేస్తున్నారని భవిష్యవాణిలో ఆమె తెలిపారు. నా బిడ్డలను నేనే రక్షిస్తా.. అలాగే దుష్టులని శిక్షిస్తా నని సృష్టం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని రంగంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.













