అమెరికా సదస్సుకు జేఎన్టీయూ రిజిస్ట్రార్
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ (ఐఓఈఎం) సొసైటీ ఆధ్వర్యంలో అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూరు హుస్సేన్‌కు ఆహ్వానం అందింది. స్మార్ట్ మొబిలిటీ అండ్ వెహికల్ ఎలక్ట్రిఫికేషన్ అంశంపై అక్టోబర్ 10 నుంచి 12 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ కార్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు మంజూరు హుస్సేన్ 8వ తేదీన అమెరికా (మిచిగాన్) వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక దేశాల విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొనే అంతర్జాతీయ వేదికపై టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యత, పరిశోధనల ద్వారా కొత్త ఆవిష్కరణలకు జేఎన్టీయూ చేస్తోన్న కృషిని వివరిస్తానన్నారు. తనకు అవకాశం కల్పించిన యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.













