జేఎన్టీయూహెచ్ వేదికగా.. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జేఎన్టీయూహెచ్ వేదికగా వచ్చే ఫిబ్రవరి 23 నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు ఇటీవల జేఎన్టీయూ హెచ్ని సందర్శించి ఇక్కడ మహాసభల నిర్వహణకు అంగీకరించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1914 నుంచి ఏటా ఈ మహాసభలు నిర్వహిస్తోంది. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) కొంతవరకు నిధులు ఇవ్వనుంది. సాధారణంగా సైన్స్ కాంగ్రెస్ను ప్రధాని ప్రారంభిస్తారు. ఒకవేళ స్వయంగా హాజరు కావడం వీలుకాకుంటే ఆన్లైన్లోనైనా పాల్గొంటారు. ఈసారి ప్రధాని మోదీ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది.













