పిస్తా హౌస్ తో జియో భాగస్యామ్యం
జియోఫోన్ కొనుగోలుపై హలీం డిస్కౌంట్ కూపన్లు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వాసులకు ఎంతో ప్రీతిపాత్రమైన హలీంను అందించేందుకు పిస్తా హౌస్ సిద్ధమైంది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో తన జియోఫోన్ విక్రయాల కోసం పిస్తా హౌస్ తో భాగస్వామ్యమైంది. ఇందులో భాగంగా జియోఫోన్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్ కు హలీం డిస్కౌంట్ కూపన్లను అందిస్తుంది. వినియోగదారులు ఈ డిస్కౌంట్ కూపన్ తో హైదరాబాద్ లోని కొన్ని ఎంపిక చేసిన పిస్తా హౌస్ కౌంటర్లలో హలీం ను కొనుగోలు చేయవచ్చు.
కొనసాగుతున్న ‘జియోఫోన్’ జోరు
ఇంటర్నెట్ సేవలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు ‘జియోఫోన్’ స్మార్ట్ ఫీచర్ ఫోన్ తో మార్కెట్లో తన జోరును కొనసాగిస్తోంది. జియోఫోన్ వినియోగదారుల కోసం జియో ఇటీవలే ప్రకటించిన రూ. 49 సంచలన ఆఫర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కేవలం రూ. 49 చెల్లించి నెల రోజుల పాటు ఉచితంగా,నిరంతరాయంగా జియోఫోన్ లో మాట్లాడేందుకు ఈ ఆఫర్ వీలు కల్పిస్తుంది. గతంలో కేవలం వాయిస్ నెట్వర్క్ను మాత్రమే వినియోగించే ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఇప్పుడు అందుబాటు ధరలోని జియో ఫోన్ , సరసమైన ధరలో ఉండే జియో ఎల్టీఈ టారిఫ్ ప్లాన్స్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ అంతులేని మధురానుభూతికి లోనవుతున్నారు.
మరిన్ని వివరాలకు: రాజేష్- 7702220228













