వాతావరణ మార్పులపై వర్క్ షాప్

అమెరికన్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, ఒడిశాకు చెందిన వ్యూస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు-జర్నలిస్టులకు అవగాహన వర్క్‌షాప్ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ప్రారంభమైంది. దీనికి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజే) సహకారం అందిస్తున్నది. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రజ్య్రోతి ఎడిటర్ కే శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరావత్ అలీ, వ్యూస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భీమారావు, యూఎస్ కాన్సులేట్ సీపీఆర్వో బాసిత్ తదితరులు పాల్గొన్నారు.