పోసానిని తెలంగాణ నుంచి బహిష్కరించాలి
తెలంగాణ నుంచి సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని బహిష్కరించాలని తెలంగాణ జనసేన ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి కుట్ర జరుగుతోందని అన్నారు. పోసాని ఇంటిపై రాళ్ల దాడికి తెలంగాణ జనసేనకు సంబంధం లేదని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని వ్యాఖ్యల వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. పోసానిపై పెట్టిన కేసులు తీసుకోకపోవడం తమకు అనుమానాలున్నాయని అన్నారు. తెలంగాణలో ఒక పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేదని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్, బీజేపీ నేత బండి సంజయ్, ఎంపీ అసదుద్దీన్‌కు ఇదే జరగొచ్చన్నారు. పోసానిని కంట్రోల్ చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. పనికిరాని వ్యక్తికి 300 మంది పోలీస్ సెక్యూరిటీ అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోసానిపై నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేస్తాం. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













