జనసేన డిపాజిట్లు గల్లంతు
తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంది. బీజేపీ పొత్తు ప్రతిపాదించడంతో సీట్ల కేటాయింపులో 8 స్థానాలతో పవన్ కళ్యాణ్ పార్టీ సరిపెట్టుకుంది. ఇందులో ఐదు స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పోటీ చేసింది. ఇందులో కొన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు. కానీ, ఆయన ప్రచార ప్రభావం, పార్టీ విధానాల ప్రభావం తెలంగాణ ప్రజలపై పెద్దగా లేదని ఈ ఎన్నికలతో తేలిపోయింది. ఈ పార్టీ పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా కాపాడుకోలేకపోయింది. కూకట్పల్లిలో జనసేన పార్టీకి సెటిలర్ల నుంచి ఓట్లు పడతాయని ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కానీ, ఓట్లు పడలేదు. దీంతో పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణలో అట్టర్ ఫ్లాప్ షో ఇచ్చినట్టయింది.













