కరీంనగర్ లో జనసేన సభ
జనసేన పార్టీ మే మొదటి వారంలో తెలంగాణలో బహిరంగ సభ నిర్వహించనుంది. కరీంనగర్లో నిర్వహించబోయే ఈ సభకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ ఇటీవల తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పర్యటన ప్రారంభించిన పవన్ క్షేత్రస్థాయిలో అభిమానులు, ప్రజలతో మమైకమై సమస్యలు తెలుసుకున్నారు. వివిధ చోట్ల అభిమాన సంఘ నేతలు, పార్టీ నేతలతో సమావేశమై పార్టీ నిర్మాణం గురించి చర్చించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించిన పవన్ దీనిలో భాగంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.













