జానారెడ్డి సంచలన ప్రకటన.. రాజకీయాల నుంచి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కందూరు జానా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి ఇక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‍లో నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉండదను కుంటున్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయమే. ఉప ఎన్నికల్లో గెలిచినా ఇలాంటి నిర్ణయమే ప్రకటించేవాన్ని. అయితే అనుహ్యమైన పరిస్థితులు ఏర్పడితే తప్ప మళ్లీ పోటీ చేయను అని జానారెడ్డి తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగమంతా సాగర్‍లో తిష్టవేసి సర్వం ఒడ్డినా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఓట్లను సాధించి సత్తా చాటిందని అన్నారు. సాగర్ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు, విజయం సాధించిన టీఆర్‍ఎస్ అభ్యర్థిని అభినందిస్తున్నట్లు జానారెడ్డి పేర్కొన్నారు.