NRI ల మద్దతుకై జలగం సుధీర్ విదేశి పర్యటన ?
– కోదాడ అసెంబ్లి సీట్ కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచిన వైనం
2001 నుండి TRS / BRS పార్టి లో ఉంటు అటు ఆన్లైన్,ఇటు ఆన్ రోడ్ లో తెలంగాణ ఉద్యమం లోను, ఇటు పార్టి విజయం కోసం కృషి చేసిన జలగం సుధీర్ 2016 లో అమెరికా నుండి తిరిగివచ్చి కోదాడ అసెంబ్లి టికెట్ కోసం అనంతరం నల్లగొండ పార్లమెంట్ సీట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశాడు. సుమారు 400 మంది NRI లు / పారిశ్రామిక వేత్తలు విదేశాల నుండి సుధీర్ టికెట్ కోసం యువ నేత KTR కు పలుసార్లు విజ్ఞప్తులు చేస్తు అవసరం అయితే పార్టి ఫండ్ కూడా ఇస్తామని హామి ఇచ్చారు. 2018 అసెంబ్లి సమయం లో సర్వే ఫలితాలు సరిగ్గా రాలేదని ఇంకేదైన మంచి అవకాశం పరిశీలిద్దామని KTR ప్రవాస భారతీయులకు చెప్పారు.
పార్టి పెద్దల సూచనతో 2018 నుండి కోదాడ లోనే మకాం వేసి నిరంతరం ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెల్లటం లో కీలకపాత్ర వహిస్తున్న జలగం సుధీర్ ఈ సారి 2023 లో కోదాడ సీట్ కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అనేకమంది ఎనారై లు KTR ను కలిసినందువల్ల అమెరికాలోని NRIల మద్దతు కై మరొసారి విదేశి పర్యటనకు జలగం వెల్లినట్లు సమాచారం.
2023 లో KTR ముఖ్యమంత్రిగా అయ్యే సూచనలు ఉన్నందువల్ల తనకంటు ఒక ప్రత్యేకమైన టీం ఎర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ టీం లో జలగం సుధీర్ కు అవకాశం వస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.













