కోదాడ బరిలో ఎన్ఆర్ఐ జలగం సుధీర్

కోదాడ నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. అందుకు ఆయన ప్రచార రథాలను, కరపత్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు మీడియాకు తెలిపారు. అంతేకాక ద్వితీయ శ్రేణి నాయకులతో గ్రామకమిటీలను ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్, ఆన్‌రోడ్డు ప్రచారానికి ప్రణాళికలను రూపొందించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలుసార్లు మంత్రి కేటీఆర్‌కు కలిసి టికెట్ కోసం కోరినా స్పందన రాకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారం నుంచి నియోజకవర్గ ప్రజలకు చేయబోయే పనులు, చేసే కార్యక్రమాలను ఇంటింటి తిరిగి ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు.