కోదాడ బరిలో జలగం సుధీర్ కుమార్
ఎక్కడో విదేశాలలో జీవనం సాగించి కొన్నెండ్ల తర్వాత తిరిగొచ్చి పుట్టిన గడ్డ కోసం సేవలు అందిస్నున్న ఎన్నారై జలగం సుధీర్ కుమార్. చిన్నప్పటి నుంచే సమాజంలోని అనేక సమస్యలపై పోరాడుతున్నారు. ఆపదలో ఉన్న వారికి సహయం చేస్తూ, వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తూ అవి పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తున్నారు. రాజకీయాలు కేవలం ఎలక్షన్ల సమయం లోనే మిగతా సమయం అంత పార్టిలకతీతంగా ఇష్యుస్ మీద పని చేయటమనే ఆలోచన తో ఇష్యు బేస్డ్ పాలిటిక్స్ ప్రచారకర్తగా జలగం సుధీర్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు టిక్కెట్ ఖరారైనట్లేనని బిఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కోదాడ ప్రాంతంలోని సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు సుధీర్. తండ్రి పేరు రంగారావు. చిన్నప్పుడే సమాజంపై అవగాహన పెంచుకున్నారు. చదువులో మొదటి స్థానంలో ఉండే సుధీర్‌కు ఉపన్యాస, వ్యాస రచన పోటీల్లో ఎప్పుడూ ప్రథమ బహుమతులు అందుకునే వారు. జె.ఎన్.టి.యులో ఎంబిఏ (కంప్యూటర్స్) పూర్తి చేసి అమెరికా, ఇండియా, కెనడా, ఇంగ్లాండ్ లలో పలు ప్రఖ్యాత కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, పలు ప్రాజెక్ట్ లలో మేనేజర్ గా పని చేశారు. ప్రస్తుతం ఎంఐటి అనే కంపెనీలో సీనియర్ కన్సల్టంట్ గా సియటెల్ సిటీలో పనిచేస్తున్నారు. టెక్ మహింద్ర, పట్ని, కాగ్నిజంట్, ఎన్ టి టి, బ్రిటిష్ టెలికం, కాస్కొ, సుబరు మోటర్స్, మెర్క్ ఫార్మా మొదలైన కంపెనీల్లో సమర్థవంతమైన పనులు నిర్వహించారు. తను చేసిన కంపెనీల్లో అనేక సార్లు ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు పొందారు.
తన మాతృగడ్డకు ఏదైన సమస్య ఎదురైతే పరిష్కారంకోసం అజేయపోరాటం చేయడంలో సుధీర్ కృషిని స్థానిక ప్రజలు గుర్తించారు. సుమారు 250 కోట్ల విలువైన కోదాడ పెద్ద చెరువు భూమిని కాపాడటం కోసం సంవత్సరంపాటు కష్టపడి అమెరికా నుంచే వివిధ మార్గాల్లో 300 పైగా పేజీల కబ్జాల వివరాలు సేకరించి మంత్రి హరిష్ రావుకు అందజేసి, మిని ట్యాంక్ బండ్ ఏర్పాటయ్యేలా శ్రమించారు. సుమారు 180 వరకు ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలలో అనేక మార్పుల విషయంలో పత్రికాముఖంగా, ప్రత్యేక లేఖ ద్వారా ముఖ్యమంత్రికి సూచనలు అందించారు. అంతేకాదు నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్దుల విషయంలో సొంత ఖర్చులతో సామాజిక స్పృహ కోసం పాటలు రాయించి ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీతో విడుదల చేయించారు. ప్రభుత్వ బడుల నిర్వహణ, సొంతంగా ఆదాయ వనరుల సమీకరణ దిశగా విద్యా శాఖకు విలువైన సూచనలు అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అమెరికాలో చదువుకుంటున్న సుధీర్ పెద్ద కుమారుడు వేదాన్ష్‌ను స్వరాష్ట్రమైన తెలంగాణలోని సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాడు. కొంతకాలం గ్రామీణ వాతావరణం, వివిధ సామాజికవర్గాల వృత్తులను వేదాన్ష్‌కు పరిచయం చేశారు సుధీర్. అమెరికాలోని కాఫి విత్ ప్రిన్సిపాల్ కార్యక్రమం ఇక్కడ తెలంగాణలోని 280 కి పైగా బి.సి. వెల్ఫేర్ బడుల్లో జరుపుకునేల చొరవ తీసుకొని ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించాడు. ప్రభుత్వ బడుల్లో చేసిన కార్యక్రమాలకు టీచర్ వారియర్ అవార్డుతో ఆయనను సన్మానించారు.
ఒకవైపు ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మరియు యువనేత కె.టి.ఆర్ ఆశిస్సులతో ప్రభుత్వం కార్యక్రమాలు ప్రజల్లో ప్రచారం చేస్తూనే మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ కార్యక్రమాల అంశాల మీద 5000 కి పైగా ఆర్టిఐ అప్లికేషన్ ల ద్వారా సమాచారం సేకరించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పనితీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువచ్చి ప్రజలకు మేలు జరిగేలా కృషి చేస్తున్నారు. నిర్భయ ఫండ్స్ వినియోగం, ప్రజా ప్రతినిదుల విదేశి ఖర్చులు, సాయిల్ టెస్టింగ్, సీడ్ డెవలప్ మెంట్, వివిధ మునిసిపాలిటిల్లో ఖర్చుల దుర్వినియొగం, హరితహారం లో మొక్కల వివరాలు, ప్రభుత్వ భూముల వివరాలు లాంటి అనేక ఆంశాల మీద ఆర్టిఐ ద్వారా అధికారుల్లో కదలిక తీసుకొచ్చి నిధులు దుర్వినియోగం అవకుండా చూశారు.
ఉమ్మడి నల్లగొండ లో తీవ్రంగా ఉన్న ఫ్లోరొసిస్ సమస్య మిషన్ కాకతీయ, మిషన్ భగిరధ దార్ కొంతవరకు రూపుమాపే ప్రయత్నం జరుగుతున్న ఇప్పటికే ఆ వ్యాధితో భాదపడుతున్న సుమారు 2 లక్షల మందికి ఒక ప్రత్యేక కార్పొరెషన్ కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతోపాటు, ఫ్లోరొసిస్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారిలో ఆత్మవిశ్వాసం నింపి, వారిలో నైపుణ్యం కలవారికి తోడ్పాటును అందిస్తున్నారు.
సుధీర్ నిరంతరం ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. గురుకులంలో చదువుకునే విద్యార్దులకు ఉపకార వేతనం, బంగారు పతకాలు అందజేశారు. అమెరికాలో చనిపోయిన కుటుంబాలకు సహాయం చేశారు. వరద బాధితులకు సహాయక కార్యక్రమాలు చేశారు. అంతేకాదు 1999 లో జరిగిన కార్గిల్ యుద్ద సమయాన విరాళాల సేకరించారు. వారి కుటుంబాలకు సహయంగా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్దులకు ఆర్దిక సహయం, విద్యార్దులకు ఫీజులు, ఆనారోగ్యంగా ఉన్న కొంతమంది బందుమిత్రుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం, ఆసుపత్రి బిల్లులు చెల్లించారు. తెలంగాణ సమాజం కోసం పాటుపడుతున్న రచయితలన్నా, కవులన్నా సుధీర్‌కు ఎంతో అభిమానం. అందెశ్రీ, దేశపతి శ్రీనివాస్, రసమయి లాంటి కళాకారులతో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు సుధీర్. తెలంగాణను అవినీతి రహిత సమాజం చేసేందుకు స్వయం సేవక సంఘాలతో కలిసి పని చేస్తున్నారు.
ప్రవాస గొంతుక అనే కార్యక్రమం ద్వారా ప్రవాస భారతీయుల ఆలోచనలను, సలహాలను, ఫిర్యాదులను ప్రభుత్వానికి చేర్చుతున్నారు. వ్యవసాయంలో సరికొత్త టెక్నాలజీ మార్పులను తీసుకువచ్చి రైతులను ఆదుకోవాలని భావిస్తాడు. అందుకనుగుణంగా పథకాలను ఆయన రూపొందిస్తున్నారు విద్యార్దులకు నైతిక విలువలు పెంచటం కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని తపిస్తున్నాడు. యువత రాజకీయాల్లోకి కూడా వచ్చేలా కృషి చేస్తున్నారు.
త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కోదాడ నుంచి బిఆర్ఎస్ తరపున పోటీ చేయాలన్న తన కోరికను ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తాను నియోజకవర్గంలో చేసిన, చేస్తున్న అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాల వివరాలను వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని హామి ఇచ్చారు. ఆయనకు టిక్కెట్ ఖరారైనేట్లేనని బిఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఏదీ ఏమైనా అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి సొంతరాష్ట్రం, సొంతఊరు అభివృద్ధికి కృషి చేస్తున్న సుధీర్ కుమార్ ఈ ఎన్నికల్లో గెలిచి మరింతగా నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకు సేవలందించాలని ఎన్నారైలతోపాటు పలువురు ఆశిస్తున్నారు.













