మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్
ఐటి పరిశ్రమల విస్తరణలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఐటీ సౌధాన్ని (టవర్) ఏర్పాటు చేస్తున్నామని ఆ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో పరిశ్రమల స్థాపనకు 18 సంస్థలు ముందుకొచ్చాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో 18 ఐటీ సంస్థల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి అంగీకారపత్రాలను అందజేశారు. కేటీఆర్ వారిని స్వాగతించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధానాల వల్ల హైదరాబాద్ పాటు ద్వితీయశ్రేణి నగరాలక ఐటీ విస్తరిస్తోంది. ఇప్పటికే నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఐటీ పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లోనూ ఆ పరిశ్రమల ఏర్పాటు పెద్దఎత్తున జరగనుంది. అక్కడ ఏర్పాటు చేసే ఐటీ సౌధానికి త్వరలోనే అన్ని పరిపాలన పరమైన అనుమతులను ఇస్తాం. ఈ 18 సంస్థలే గాక మరిన్ని సంస్థలు మహాబూబ్‌నగర్‌లో పరిశ్రమలను స్థాపించేందుకు ప్రవాస తెలంగాణ పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుంటాం. శ్రీనివాస్‌గౌడ్ సహా అన్ని జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు స్థానికంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయం. త్వరలోనే మరిన్ని నగరాలకు ఐటి పరిశ్రమలు విస్తరిస్తాం అని కేటీఆర్ తెలిపారు.
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహాబూబ్‌నగర్ లాంటి వెనకబడిన జిల్లాకు ఐటీ సౌధం ఎంతో మేలు చేస్తుందని, యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు విద్యార్థులకు లబ్ధి చేకూరుతుదని తెలిపారు. ఐటీ సాధం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.15 కోట్లను మంజూరు చేసిదన్నారు. ఐటీ శాఖ సహకారంతో మరిన్ని కంపెనీల పెట్టుబడుల కోసం త్వరలోనే అమెరికా వెళతామని చెప్పారు.













