టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటికి షాక్
ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనవాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి హైదారాబాద్లో 11, ఖమ్మంలో 6, మొత్తం 18 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో శ్రీనివాసరెడ్డి దేశవ్యాప్తంగా నిర్మాణ పనులు చేపడుతుంటారు. పార్లమెంటు సభ్యుడి సంస్థల్లో ఆదాయపన్నుశాఖ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఖమ్మంలోని ఎంపీ నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ తనఖీలు జరిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నివాసం ఉంటున్న పొంగులేటి బంధువు జె.శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంటి ఆవరణలో ఎంపీతో ఉన్న బంధుత్వం అడిగి వెనుదిరిగారు. సత్తుపల్లిలో ఉండే ఎంపీ అనుచరుడు టి.గణేష్ ఇంటికి వెళ్లి ఆయన లేకపోవడంతో తిరుగుముఖం పట్టారు. అశ్వారావుపేటకు చెందిన మరో అనుచరుడు జూపల్లి రమేశ్ ఇల్లు, కార్యాలయంలోనూ సోదాలు జరిపారు.













