మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. నిన్న రాత్రి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బహిర్గతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడం, ప్రతిగా బీజేపీ శ్రేణులు కూడా నిరసనలకు దిగడంతో రాష్ట్రంలో ఉద్త్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.













