అలా మాట్లాడటం కేసీఆర్ కు సరైంది కాదు : ఈటల

తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొసాగుతుందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ నాయకులను, కార్యకర్తలను నాశనం చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఈటల స్పందించారు. డబ్బులతో అధికారాన్ని కొనలేమని, అలా మాట్లాడటం కేసీఆర్‌కు సరైంది కాదని సూచించారు. పోలీసులతో పోలీస్ రాజ్యంగా, ఇతర పార్టీల కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతూ ఒక శాడిస్టులాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని అన్నారు. దౌర్జన్యం చేసిన ప్రభుత్వాలు తెలంగాణ గడ్డ మీద ఏ విధంగా పతనమయ్యాయో చూసిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ ఇలా చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయామని అన్నారు.