నిజామాబాద్ లో ఇంక్యుబేషన్ సెంటర్
తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్‌ను నిజామాబాద్ జిల్లా ఎంపి కవిత సచివాలయంలో కలిశారు. తన నియోజకవర్గానికి రూ.350 కోట్లు కేటాయించినందుకు కేటీఆర్‌కు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్లు చొప్పున, 5 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్లు చొప్పున, నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి రూ.100 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లు మంజూయ్యాయని తెలిపారు. అలాగే నిజామాబాద్‌లో ఇంక్యుబేషన్ సెంట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. భవిష్యత్తులో జిల్లాలో మరిన్నీ ఐటీ పార్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ కంపెనీల ఏర్పాటుతో గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే కృషితో 60 ఐటి కంపెనీలు ఈ ఐటి హబ్‌లో ఏర్పాటు కానున్నాయని, వచ్చే దసరా నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు.













