చంద్రబాబు అరెస్టుకు నిరసనగా .. ఐటీ ఉద్యోగుల ఆందోళన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు. విప్రో సర్కిల్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయామ్ విత్ సీబీఎన్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో విప్రో కూడలిలో ఉద్రిక్తత నెలకొంది.
చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. కక్ష సాధించేందుకే బాబును జైల్లో పెట్టారు. ఆయన వల్లే మాకు ఉపాధి అవకాశాలు లభించాయి. మా జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటాం. సైకో పోవాలి. సైకిల్ రావాలి. కక్ష సాధింపు రాజకీయాలు అభివృద్ధికి విఘాతం. వచ్చే ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం అని ఐటీ ఉద్యోగులు హెచ్చరించారు.













