రేవంత్ రెడ్డికి మరో షాక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం, ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం పనివారు తప్ప కుటుంబసభ్యులెవరూ లేరు. అయినప్పటికీ 11 మంది సభ్యులు గల ఐటీ బృందంలో ఆ ఇంటిలో సోదాలు చేస్తోంది. అటు కొండగల్‌లోని రేవంత్, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ వర్కింట్ ప్రెసిడెంట్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి నేడు కొండగల్ నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ రోజు ఉదయం 9-10 గంటల మధ్య ప్రచారం ప్రారంభానికి ఆయన అంతా సిద్దం చేసుకున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. ఈ దాడలుపై ఆయన ఇంకా స్పందించలేదు.













