ప్రజల ప్రాణాల కంటే సీఎం సభ ముఖ్యమా ? : బండి

తెలంగాణలో ప్రజాస్వామ్యం మంట కలిసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 317 జీవోపై ప్రజా స్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులకు ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు, టీఆర్‌ఎస్ నిరసనలకు అనుమతినివ్వడం సిగ్గుచేటన్నారు. జనగామలో గాయాలపాలైన కార్యకర్తలు ఆసుపత్రిలో చావు బతుకుమ మధ్య కొట్టుమిట్టాడుతుంటే వారి ప్రాణాల కంటే పోలీసులకు సీఎం సభే ముఖ్యమైందా అని మండిపడ్డారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బీజేపీ అడ్డుకుని తీరుతుందని, ఇందుకోసం ఎంతవరకైనా పోరడతామని స్పష్టం చేశారు.