ఇరాన్ లో ఎన్నికలు.. హైదరాబాద్ లో ఓటింగ్

ఇరాన్‍లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. తమ దేశ పౌరులందరూ ఈ ఎన్నికల పక్రియలో పాలుపంచుకునేందుకు వీలుగా .. ఆ దేశ కాన్సులేట్ భారత్‍లోని ఢిల్లీ, హైదరాబాద్, రాజమండ్రి, బెంగళూరు, పుణే, ముంబై తదితర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే హైదరాబాద్‍లోని బంజారాహిల్స్లోని కాన్సులేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 220 మంది ఇరాన్ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో 28 మంది పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.