కుతుబ్ షాహీ టూంబ్స్ ను సందర్శించిన ఇరాన్ అధ్యక్షుడు
హైదరాబాద్లోని చారిత్రక కుతుబ్షాహి సమాధులను ఇరాన్ అధ్యక్షుడు హుస్సేన్ రోహీని సందర్శించారు. ఆయన గోల్కొండలో పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర నిర్మాత, కుతుబ్షాహిల్లో నాలుగో రాజైన మహ్మద్ కులీకుతుబ్షా సమాధిని సందర్శించారు. గోల్కొండ సమాధుల్లో ఆఘాఖాన్ ట్రస్టు చేపట్టిన పనుల గురించి తెలుసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం, హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా, ఇరాన్ అధ్యక్షుడి వెంట ఉన్నారు.













