రాష్ట్రపతి తేనీటి విందుకు నెల్లుట్ల సర్పంచ్ దంపతులకు ఆహ్వానం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల సర్పంచ్ చిత్ర స్వరూపారాణి, భూపాల్‌రెడ్డి దంపతులకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి నివాసంలో జరిగే ( ఎట్ హోం) తేనీటి విందుకు ఆహ్వానం అందినట్టు సర్పంచ్ స్వరూప రాణి తెలిపారు. గ్రామంలో జలవనరుల అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు గాను నిరుడు ఏప్రిల్ 17న రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డును అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో తీసుకున్నారు. గత ఏడాది వివిధ విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 46 జాతీయ అవార్డుల్లో జల వనరుల అభివృద్ధిపై జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నారు.













