మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు గచ్చిబౌళిలోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 10న జరగనున్న స్వామి వారి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక, వాల్ పోస్టర్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. మిథుల ప్రాంగంణంలో జరిగే కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు.













