సమ్మక్క, సారలమ్మ జాతర.. సీఎం రేవంత్ కు ఆహ్వానం
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ మేడారం జాతరకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ పూజారుల సంఘం ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన పోస్టర్లను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23న మేడారం జాతరకు తాను వస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతర ఏర్పాట్లు, జాతరలో చేపట్టవలసిన పనులు, పూజారుల సమస్యలపై పూజారులు, దేవాదాయం శాఖ అధికారులు సీఎం రేవంత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.













