‘నిమ్స్-మి’ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు యూసఫ్ గూడా లోని నిమ్స్-మి సంస్థలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సంస్థ డైరెక్టర్ జనరల్ డి. చంద్రశేఖర్ ప్రసంగిస్తూ మహిళలు అన్ని రంగాల్లో పురోగమించి నప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని తెలిపారు. మహిళల పురోభివృద్ధి కోసం సంస్థ అనేక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతోందని, స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో సంస్థ సేవలు మరింత వినియోగించుకొని తద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఎంఎస్ఎంఈ, భారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. మహిళలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యకమానికి విశిష్ట అతిధులుగా Dr. ఫహిమా భాను, గైనకాలజిస్ట్, మల్లిక, ఏజీఎం, ఎస్బీఐ, సిస్టర్ శ్రీలత బ్రహ్మకుమారీస్ లు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా వారి అభివృద్ధి కోసం నిమ్స్-మి సంస్థ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమం అనంతరం సంస్థలో వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకున్న మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సంస్థ డైరెక్టర్ జనరల్ డి. చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా.ఈ. విజయ తో పాటుగా సంస్థ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.













