FTCCIలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలి: ప్రాంతీయ పాస్పోర్టు అధికారి స్నేహజ జొన్నలగడ్డ
మీడియా అనుబంధంగా ఉండటంతో పత్రికల్లో వచ్చే వార్తలు నేతలకు నచ్చక తమ చిట్ఫండ్ సంస్థ రెండుసార్లు రాజకీయ కక్షలను చవి చూసిందన్నారు: మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్
బుధవారం రాత్రి ఎఫ్‌టిసిసిఐ రెడ్‌హిల్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
‘మహిళల్లో పెట్టుబడి పెట్టండి: ప్రగతిని వేగవంతం చేయండి’ అనే థీమ్‌తో వేడుకలు జరిగాయి. మహిళలు మరియు పిల్లల సంక్షేమాన్ని ప్రభావితం చేసే ఐదు ముఖ్యమైన అంశాలపై ఇది దృష్టి సారించింది.
ఎఫ్‌టిసిసిఐ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలను ఆహ్వానించి, ఇతివృత్తంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వేడుకలను నిర్వహించింది.
గౌరవ అతిథిగా శ్రీమతి స్నేహజ జొన్నలగడ్డ, IFS., ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
శ్రీమతి Ch. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ మరియు ఎంఎస్ ప్రవీణ తోట, మహిళా ఎన్విజన్ కౌన్సిల్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థాపక డైరెక్టర్, గోమయ పుష్పం ప్యానలిస్టులుగా పాల్గొన్నారు.
విజయానికి దగరి దారులుండవు.. శ్రమిస్తేనే లక్ష్యానికి చేరువకావొచ్చు అని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు ప్రతి క్షణం కష్టపడటం ఒక్కటే మార్గమని.. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగల మని ఆమె అన్నారు.
ఎఫ్ టీ సీసీఐ మహిళా విభాగం చైర్ భగవతీ దేవి అధ్యక్షతన జరిగిన చర్చాగోష్ఠిలో శైలజా కిరణ్ తన జీవితానుభవాలను పంచుకు న్నారు. తాను ప్రతిరోజు 14 గంటలు పని చేస్తానని తెలిపారు. మీడియా అనుబంధంగా ఉండటంతో పత్రికల్లో వచ్చే వార్తలు నేతలకు నచ్చక తమ చిట్ఫండ్ సంస్థ రెండుసార్లు రాజకీయ కక్షలను చవి చూసిందన్నారు.
ప్రాంతీయ పాస్పోర్టు అధికారి స్నేహజ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. మార్పు అనేది ఇంటినుంచే మొదలు కావా లన్నారు. నిన్నటి వరకు అమ్మాయి పుడితే భారంగా భావించేవారని, ఇప్పుడు అమ్మాయిలే మేలనుకునే రోజులు వచ్చాయన్నారు. పనిచేసేచోట లైంగిక వేధింపుల నుంచి రక్షణకు చట్టాలున్నాయన్నారు. సినిమాలు, బుల్లితెరల ప్రభావం కూ కూడా సమాజంపై ఉంటుందన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్.మోతి.. మహిళా సాధికారితకు, సంక్షే మానికి ఎలాంటి కార్యక్రమాలున్నాయో వివరించారు.
సదస్సులో ఉమెన్ ఎన్విజన్ కౌన్సిల్ ఫర్ ఎంటర్ప్రైన్యూర్షిప్ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రవీణ తోట, శ్రీదేవి స్వగృహ ఫుడ్ వ్యవస్థాపకురాలు సక్కి నాల సావిత్రమ్మ, ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ మహిళా విభాగం సలహాదారు ప్రొ. విజయ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ సీసీఐ అధ్యక్షుడు మీలా జయదేవ్, సీనియర్ ఉపాధ్యక్షుడు సురేష్కు మార్ సింఘాల్ పాల్గొన్నారు.